స్పెయిన్‌లో ఢీకొన్న రైళ్లు-10మంది మృతి

ఫొటో సోర్స్, EPA
స్పెయిన్‌లో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 10 మంది మృతి చెందారు. అయితే, మృతుల సంఖ్య దీనికంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వార్తా కథనాల్లో మృతుల సంఖ్య 46కు చేరినట్లు పేర్కొన్నారు.
మాడ్రిడ్‌కు దక్షిణంగా సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉర్దా పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో కనీసం 30 మంది మరణించినట్లు ప్రాంతీయ ప్రభుత్వ వర్గాలు స్పెయిన్‌కు చెందిన ఎఫె వార్తా సంస్థకు తెలిపాయి.
ప్రైవేటు సంస్థ ఇరియో నడుపుతున్న రైలులో 147 మంది ప్రయాణికులు ఉండగా, హైస్పీడ్ రైలులో 397 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆగి ఉన్న ఇరియో రైలును హైస్పీడ్ రైలు వెనుక నుంచి ఢీకొట్టిందా అనే విషయాన్ని ఇప్పటి వరకు నిర్ధరించలేకపోయామని అధికారులు తెలిపారు.
ప్రమాదానికి సంబంధించి అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే, పట్టాలలో తలెత్తిన సమస్య కారణంగా ఒక రైలు నిలిచిపోగా, వెనుక నుంచి వచ్చిన హైస్పీడ్ రైలు దానిని ఢీకొట్టినట్లు వార్తా కథనాలు సూచిస్తున్నాయి.



















