BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ముస్లింలను దేశం నుంచి తరిమేయాలని కోరుకునే హిందువుల గురించి ఆరెస్సెస్ చీఫ్ ఏం చెప్పారు? కాంగ్రెస్, ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏమని స్పందించాయి?
అన్ని మతాలు అంతిమంగా దైవాన్వేషణకే దారితీస్తాయని హిందూ సంప్రదాయం చెబుతోందని భాగవత్ అన్నారు. ఇతరచోట్ల రక్షణ లభించని వివిధ మతాల ప్రజలకు భారతదేశం ఎప్పటి నుంచో ఆశ్రయం కల్పిస్తోందని ఆయన చెప్పారు.
నేపాల్ వరదలు: చుట్టూ అంతా కొట్టుకుపోతున్నా కదలని ఇల్లు
ఈ వీడియోలో కనీసం ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒక వ్యక్తి, ఒక మహిళ, మరొకరు చిన్నారి. ఆ చిన్నారి బాలిక అయి ఉండవచ్చని తెలుస్తోంది. ఇంటి రెండో అంతస్తులో బాల్కనీని పోలిన ప్రదేశంలో ఈ వ్యక్తులు చిక్కుకుపోయినట్లు కనిపిస్తున్నారు.
‘దేవతలతో మాట్లాడతాను’ అని చెప్పుకునే నార్వే యువరాణికి సింహాసనం ఎందుకు దక్కలేదు?
"నేను భవిష్యత్తును చూడలేను, కానీ అవతలి వ్యక్తిలోని శక్తులను గ్రహించగలను. స్టేజ్ మీద మాట్లాడేందుకు భయపడే అమ్మాయి నుంచి ఆత్మ విశ్వాసం ఉన్న మహిళగా నేను ఎదిగాను. రోజూ నాతో మాట్లాడే రక్షక దేవతను కలిశాకే నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది " అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆపరేషన్ కోసం వచ్చిన వారిని కులం అడుగుతారు... ఎందుకో తెలుసా?
ఆర్య వైశ్య కోమటి చెట్టియార్, వైశ్య చెట్టి వర్గాలకు మాత్రమే ఈ పరిస్థితి పరిమితం కాదు. అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన మెడ్‌లైన్‌ప్లస్ డేటాబేస్ ప్రకారం, ఆర్య వైశ్య వర్గంతో పాటు పర్షియన్ యూదులు, అలాస్కా స్థానిక జనాభాలోని కొన్ని వర్గాలు, యూరోపియన్ సంతతికి చెందిన కొందరిలో కూడా ఈ లోపం కనిపిస్తుంది.
మడ అడవుల్లో మనుగడ సాగించే 'రహస్య ప్రపంచం'.. 13 ఫోటోలలో
మడ అడవులు ఇతర అడవులు కంటే ఐదు రెట్లు ఎక్కువ కార్బన్ నిల్వ చేయగలవు. వాటి వేర్లు సముద్రం నుంచి వచ్చే అలల వేగాన్ని తగ్గించి తుపాన్ల సమయంలో వచ్చే భారీ అలల నుంచి తీరప్రాంత ప్రజలను రక్షిస్తాయి.
తుర్కియేతో యుద్ధం జరిగితే ఇజ్రాయెల్ నెగ్గగలదా? ఎవరి బలం ఏ స్థాయిలో ఉంది?
ఇజ్రాయెల్‌ను సార్వభౌమ దేశంగా గుర్తించిన తొలి ముస్లిం మెజారిటీ దేశం తుర్కియే. కానీ, సుమారు ఎనిమిది దశాబ్దాల తర్వాత.. పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నాయి.
బ్యూటీ ఇండస్ట్రీని జెన్ జడ్ శాసిస్తోందా?
‘‘కరోనా కాలంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తమ సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. అదే సమయంలో టైర్-1, టైర్-2, టైర్-3 నగరాల్లో డిజిటల్ సేవలు భారీగా విస్తరించాయి. దీంతో భారతీయ వినియోగదారులకు ఇంతకుముందులేని బ్యూటీ, స్కిన్ కేర్ సమాచారం ఒక్కసారిగా అందుబాటులోకొచ్చింది’’
నేపాల్ వరదల గురించి ఇప్పటి వరకు ఏం తెలుసు?
నేపాల్ వరదలకు అసలు కారణమేంటి? హిమానీనదం కూలిపోయింది ఎక్కడ? అదెప్పుడు కూలిపోయింది? నేపాల్‌ను మరోసారి వరదలు ముంచెత్తే ప్రమాదముందా?
నేపాల్: ‘వరద ప్రమాదం చైనాకు ముందే తెలిసినా హెచ్చరించలేదా’ అంతర్జాతీయ మీడియాలో చర్చ...
నేపాల్ వరదల విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విపత్తుకు ముందు నేపాల్‌కు చైనా సకాలంలో హెచ్చరిక ఇవ్వలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను ఖండించింది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































