మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

లైవ్, ఫ్రాన్స్‌లో భారీ నిరసనలు, ఘర్షణలు.. దాదాపు వెయ్యి మంది అరెస్ట్

ఫ్రాన్స్‌లో మరోసారి భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. శనివారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆందోళనల్లో పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలకు సంబంధించి దాదాపు వెయ్యి మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

సారాంశం

  • ఫ్రాన్స్‌లో శనివారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆందోళనల్లో పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
  • ఈ ఘటనలకు సంబంధించి దాదాపు వెయ్యి మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. ఫ్రాన్స్‌: నిరసనలు, ఘర్షణలు,దాదాపు వెయ్యి మంది అరెస్ట్

    ఫ్రాన్స్‌లో శనివారం నాటి నిరసనలు, ఘర్షణలకు సంబంధించి దాదాపు వెయ్యి మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

    శనివారం పగటిపూట నిరసనలు చాలావరకు శాంతియుతంగా సాగాయి. అయితే, పారిస్ సహా పలు నగరాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. వాటర్ కానన్లను ఉపయోగించారు.

    మార్సెయ్ నగరంలో నిరసనకారులు రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్లకు నిప్పుపెట్టారు. బోర్డో నగరంలో ఓ దుకాణానికి అమర్చిన చెక్క పలకలను కొందరు తొలగించారు.

    అయితే, గత వారాంతంలో జరిగిన స్థాయిలో అల్లర్లు, దోపిడీలు జరగకుండా అధికారులు ఇప్పటివరకు నియంత్రించగలిగారు.

    శనివారం జరిగిన నిరసనల్లో సుమారు 4.10 లక్షల మంది పాల్గొన్నట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

    అయితే, ఈ సంఖ్య దాదాపు 8 లక్షలుగా ఉంటుందని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.

    జీవన వ్యయం పెరగడం, పాఠశాలల్లో అధ్వాన పరిస్థితులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా దాదాపు 70 వేల మంది పోలీసులను మోహరించారు. పలు నగరాల్లో ఆంక్షలు విధించారు.

    గతంలో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసుల సంఖ్య కంటే ఆందోళనకారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పరిస్థితులు అదుపుతప్పాయి. వందలాది వ్యాపార సంస్థల్లో దోపిడీలు జరిగాయి. భవనాలకు నిప్పుపెట్టారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

    గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు నిర్వహించే ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ వారం ప్రారంభంలోనే ఆదేశాలు జారీ చేశారు.

  2. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.