అనకాపల్లి పుష్ప: ‘ఔను. కాబోయే భర్త గొంతు కోశా.. ఎందుకంటే..’

కాబోయే భర్త గొంతు కోసిన కేసులో నిందితురాలైన యువతి పుష్పని బుచ్చెయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘‘నిన్న బండిపై నుండి పడ్డామని చెప్పిన పుష్ప ఈరోజు నేరం అంగీకరించింది. కాబోయే భర్త రామునాయుడు గొంతును తానే కోసినట్లు ఒప్పుకుంది’’ అని బుచ్చయ్యపేట పీఎస్ ఎస్ఐ రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. దీపావళికి ముందు బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి?

  2. న్యూజీలాండ్‌తో రెండో టీ ట్వంటీలో భారత్ విజయం

    తిలక్ వర్మ, ఇండియా, న్యూజీలాండ్, టీ ట్వంటీ
    ఫొటో క్యాప్షన్, తిలక్ వర్మ 26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు.

    న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.

    ఉత్కంఠగా సాగిన పోరులో కివీస్ జట్టు నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది.

    మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

    గ్లెన్ ఫిలిప్స్ 43 బంతుల్లో 77 పరుగులు చేయగా, బెవాన్ జాకబ్స్ 46 బంతుల్లో 58 పరుగులు చేశాడు.

    భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసి జట్టును విజయపథంలో నడిపాడు.

    ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని అందించారు.

    కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 4 వికెట్లు తీశాడు.

    ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.

  3. కళ్లద్దాలతో స్పష్టంగా కనిపిస్తే కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లేనా? చూపు తగ్గుతోందని ఎలా గుర్తించాలి?

  4. అజర్‌బైజాన్‌: దేవనాగరి లిపిలో 'శ్రీ గణేశాయ నమః' అని రాసి ఉన్న ఈ అగ్ని దేవాలయ చరిత్ర ఏమిటి?

  5. అల్లూరి జిల్లాలో పేలుడు, ఐదుగురి మృతి, లక్కోజు శ్రీనివాస్

    అల్లూరి సీతారామరాజు జిల్లా,  పేలుడు
    ఫొటో క్యాప్షన్, అనంతగిరి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు పాడేరు ఎస్పీ కార్యాలయం తెలిపింది.

    ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన పేలుడు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

    అనంతగిరి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు పాడేరు ఎస్పీ కార్యాలయం తెలిపింది. ఇది ప్రమాదమేనని ప్రాధమికంగా నిర్థరించినట్లు పోలీసులు బీబీసీకి తెలిపారు.

    “రోడ్డు నిర్మాణ పనుల్లో ఉపయోగించే పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న వాహనంలో అనంతగిరి మండలంలోని పినకోట సమీపంలో డీజిల్ నింపడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్థరణ జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. మృతుల్లో ఒక ప్రభుత్వ టీచర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది” అని ఈ కేసును పర్యవేక్షిస్తున్న అనంతగిరి ఎస్ఐ శంకర్రావు బీబీసీకి తెలిపారు.

    ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అల్లూరి జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

    ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

    మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

  6. ఆంధ్రప్రదేశ్: ‘‘పొంచివున్న తుపాను ముప్పు’’.. ఏయే జిల్లాల్లో అంటే..

    విశాఖపట్నం, తుపాను హెచ్చరిక కేంద్రం
    ఫొటో క్యాప్షన్, ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 120 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో తీవ్ర తుపాను గాలులు వీచే అవకాశం ఉంది.

    ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచివున్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారనుందని హెచ్చరించింది.

    ముఖ్యమైన హెచ్చరికలు, వివరాలు:

    • అల్పపీడనం బలపడే తీరు: ఆగ్నేయ, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 25 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.
    • ఇది అక్టోబర్ 26 నాటికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మరే అవకాశం ఉందని, ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనించనుందని అంచనా వేశారు.
    • భారీ వర్షాలు: ఈ ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీలలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
    • విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో అతి తీవ్ర వర్షాలు కురిసే సూచనలున్నాయి.
    • ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 120 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో (అప్పుడప్పుడు 185 కిలోమీటర్లు) తీవ్ర తుపాను గాలులు వీచే అవకాశం ఉంది.
    • మత్స్యకారులకు హెచ్చరిక: సముద్రం అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
    • ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించారు.
  7. టీమిండియా న్యూజీలాండ్ టూర్: ఇషాన్ కిషాన్ స్థానంలో ఎవరంటే...?

    ఇషాన్ కిషన్, కుమార్ కుశాగ్ర
    ఫొటో క్యాప్షన్, తొలి టీ20లో ఇషాన్ కిషన్ కుడి తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు.

    న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఇషాన్ కిషన్‌ స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ కుమార్‌ కుశాగ్రాను రెండో టీ20 మ్యాచ్ కోసం భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.

    ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్‌లో ఇండియా 'ఏ' జట్టుతో ఉన్న కుశాగ్రా, ఈ మ్యాచ్ కోసం భారత జట్టుతో కలవనున్నాడు.

    తొలి టీ20లో ఇషాన్ కిషన్ కుడి తొడ కండరాల గాయం (రైట్ అడక్టర్ స్ట్రెయిన్)తో బాధపడ్డాడు.

    రెండో టీ20 కోసం భారత్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్).

  8. ‘20 రూపాయల వాటర్ బాటిల్ కోసం మనిషిని ఇంత కిరాతకంగా చంపేస్తారా?’.. విజయవాడ మృతుడి భార్య ఆవేదన

  9. భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై ఐటీబీపీ డీజీ ఏమన్నారు? విపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి

  10. ‘బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా రొమ్ము తొలగించాల్సిన అవసరం లేదు’

  11. చదవడం, రాయడం మర్చిపోయిన ఈ బాలికకు ఏమైంది?

  12. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు కొత్త షెడ్యూల్, నవంబర్ 1న పోలింగ్, 3న లెక్కింపు

    ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు
    ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు కొత్త షెడ్యూల్

    ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురువారం రాత్రి విడుదల చేసింది.

    తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయితీలకు సంబంధించిన పోలింగ్ నవంబర్ 1న జరపనున్నారు. అవసరమైన చోట్ల రెండో తేదీన రీపోలింగ్ నిర్వహిస్తారు. మూడో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

    వాస్తవంగా అక్టోబర్ 14న నోటిఫికేషన్ ప్రకారం 16వ తేదీ నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించారు. 19న అధికారులు నామినేషన్లను పరిశీలించారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం కల్పించారు. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో షెడ్యూల్ మారింది.

    అభ్యర్థుల తుది జాబితా ప్రకటన 25వ తేదీ వరకు వాయిదా వేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈలోగా పిటిషనర్ పార్టీ(వైసీపీ), లేదా వివిధ అభ్యర్థులు సమర్పించిన విన్నపాలు పరిశీలించాలని కోర్టు సూచించింది.

    సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి తదుపరి ఎన్నికల ప్రక్రియను ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఘర్షణలు జరిగిన 4 పట్టణాల్లో అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. శనివారం (24 అక్టోబర్ 2026) 3 గంటల వరకు నామపత్రాలు దాఖలు చేయవచ్చు.

    మైదుకూరులోని అన్ని వార్డులు, రాజంపేటలోని 11 వార్డులకు, కడప కార్పొరేషన్‌లోని 11, తిరుపతిలోని 18 డివిజన్లలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అక్టోబర్ 25వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. అదే రోజు ఉపసంహరణకు గడువు విధిస్తున్నట్టు నోటిఫికేషన్ సవరించారు.

  13. వైఎస్‌ జగన్‌ రూటు మారుతోందా? 'ఏపీలో మేమే కాక్రోచ్'.. 'సీఈసీ నియామకానికి మద్దతివ్వడంపై రిగ్రెట్ అవుతున్నాం' వ్యాఖ్యల మర్మమేమిటి?

  14. ‘ఐ డోంట్‌ కేర్‌.. గెలిస్తే గెలుస్తా, లేదంటే ఓడిపోతా.. ఫైట్ అయితే తప్పదు’.. ఏబీ వెంకటేశ్వరరావు బీబీసీ ఇంటర్వ్యూలో ఇంకా ఏమేం చెప్పారు?

  15. Ind vs Nz: భారత్ టార్గెట్ 226, పది ఓవర్లకు 119/3

    హాగ్లీ ఓవల్
    ఫొటో క్యాప్షన్, 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది.

    క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పది ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.

    భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి ఐదు ఓవర్లలో 16 రన్ రేట్‌తో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సంజూ శామ్సన్ 33 బంతుల్లో 67 పరుగులు, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యారు. తిలక్ వర్మ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. క్రీజులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఉన్నారు.

    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజీలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అలెన్ 24 బంతుల్లో 45 పరుగులు చేయగా, సీఫర్ట్ 24 పరుగులు సాధించాడు. డారిల్ మిచెల్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

    నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫిలిప్స్, నాలుగో వికెట్‌కు బెవన్ జాకబ్స్‌తో కలిసి 32 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫిలిప్స్ 40 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు.

    జాకబ్స్ 16 బంతుల్లో మూడు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

    ఈ మ్యాచ్‌తో పేసర్ భువనేశ్వర్ కుమార్ 2022 తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.

  16. దసరా పండుగను అక్కడ 76 రోజుల పాటు జరుపుకుంటారు, కానీ రావణ దహనం మాత్రం ఉండదు

  17. స్థానిక సంస్థల ఎన్నికలు: తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

  18. ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలు: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
    ఫొటో క్యాప్షన్, అనిల్ చంద్ర పునేఠా

    సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 19 ప్రాంతాల్లోనే ఆపాలని భావించినా, ఇప్పుడు మొత్తం 100 స్థానాల్లో ఆపేస్తున్నట్లు పేర్కొంది.

    అభ్యర్థుల జాబితా ప్రకటన ఈ నెల 25 వరకు వాయిదా వేయడంపై ఇవాళ నిర్ణయించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీల నివేదికల ఆధారంగా తుది నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

    రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో నామినేషన్లు వేసే అవకాశం తమ పార్టీ అభ్యర్థులకు కల్పించలేదని సుప్రీంకోర్టులో వైసీపీ పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దని ఆదేశించింది. గురువారం ఒక నిర్ణయం ప్రకటించాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

    సుప్రీంకోర్టు ఆదేశాలపై బుధవారం న్యాయనిపుణులతో చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా నోటిఫికేషన్ వచ్చిన 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.

  19. ఏపీ మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల గడువుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  20. నకిలీ పోస్టల్ స్టాంపులతో అమెరికాకు రూ.100 కోట్ల నష్టం కలిగించిన పాక్ పౌరుడి అరెస్ట్

    అమెరికా, పాకిస్తాన్,
    ఫొటో క్యాప్షన్, నకిలీ పోస్టేజ్ స్టాంపులతో అమెరికాకు వంద కోట్లకుపైగా నష్టం కలిగించిన పాకిస్తానీ అరెస్టు

    నకిలీ పోస్టల్ స్టాంపులను విక్రయించే వ్యాపారాన్ని నడుపుతున్నాడనే ఆరోపణలపై పాకిస్తాన్ సైబర్ క్రైమ్ ఏజెన్సీ ఒక వ్యక్తిని అరెస్టు చేసింది.

    ఈయన చేసిన మోసం కారణంగానే యూఎస్ పోస్టల్ సర్వీస్‌కు 126 మిలియన్ (119 కోట్ల రూపాయలు) డాలర్ల నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి.

    నిందితుడిని 33 ఏళ్ల ఫహీమ్ అక్రమ్‌గా గుర్తించారు. ఈయన ఒక నకిలీ వెబ్‌సైట్ ద్వారా యూఎస్ వినియోగదారులకు నకిలీ పోస్టల్ స్టాంపులు, షిప్పింగ్ లేబుల్‌లను విక్రయించినట్లు అభియోగాలు ఉన్నాయి.

    యూఎస్ ప్రాసిక్యూటర్ల ప్రకారం, ఫహీమ్ అక్రమ్ 2023 నుంచి లేబుల్స్‌బ్యాంక్‌ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. ఈ వెబ్‌సైట్ ద్వారా నకిలీ యూఎస్ పోస్టల్ స్టాంపులు, షిప్పింగ్ లేబుళ్లను విక్రయించారనే ఆరోపణలతో అధికారులు ఆ వెబ్‌సైట్‌ను మూసివేశారు.

    ఫ్లోరిడాలోని ఒక ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ గత నెలలో అక్రమ్‌పై అభియోగాలు మోపింది. ఆయన గత కొన్నేళ్లుగా వేల మంది అమెరికన్ వినియోగదారులకు 5 మిలియన్లకు పైగా నకిలీ షిప్పింగ్ లేబుళ్లను విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    ఈ నెల ప్రారంభంలో, యూఎస్ పోస్టల్ సర్వీస్ ఆయనను పట్టుకోవడానికి తగిన సమాచారం ఇచ్చినవారికి 100,000 డాలర్ల వరకు బహుమతిని ప్రకటించింది.