మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

రేషన్ బియ్యానికి నగదు బదిలీ తప్పనిసరి కాదు – ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

ఏపీలో రేషన్ పంపిణీలో నగదు బదిలీకి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ప్రాధమికంగా కొన్ని జిల్లాల్లో సర్వే చేశారు. ప్రజాభిప్రాయాలను తీసుకున్నారు. అయితే నగదు బదిలీ పథకాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

లైవ్ కవరేజీ

అరుణ్ శాండిల్య

  1. న్యూజీలాండ్‌తో రెండో టీ ట్వంటీలో భారత్ విజయం

    న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.

    ఉత్కంఠగా సాగిన పోరులో కివీస్ జట్టు నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది.

    మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

    గ్లెన్ ఫిలిప్స్ 43 బంతుల్లో 77 పరుగులు చేయగా, బెవాన్ జాకబ్స్ 46 బంతుల్లో 58 పరుగులు చేశాడు.

    భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసి జట్టును విజయపథంలో నడిపాడు.

    ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని అందించారు.

    కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 4 వికెట్లు తీశాడు.

    ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.

  2. కళ్లద్దాలతో స్పష్టంగా కనిపిస్తే కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లేనా? చూపు తగ్గుతోందని ఎలా గుర్తించాలి?

  3. అజర్‌బైజాన్‌: దేవనాగరి లిపిలో 'శ్రీ గణేశాయ నమః' అని రాసి ఉన్న ఈ అగ్ని దేవాలయ చరిత్ర ఏమిటి?

  4. టీమిండియా న్యూజీలాండ్ టూర్: ఇషాన్ కిషాన్ స్థానంలో ఎవరంటే...?

    న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఇషాన్ కిషన్‌ స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ కుమార్‌ కుశాగ్రాను రెండో టీ20 మ్యాచ్ కోసం భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.

    ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్‌లో ఇండియా 'ఏ' జట్టుతో ఉన్న కుశాగ్రా, ఈ మ్యాచ్ కోసం భారత జట్టుతో కలవనున్నాడు.

    తొలి టీ20లో ఇషాన్ కిషన్ కుడి తొడ కండరాల గాయం (రైట్ అడక్టర్ స్ట్రెయిన్)తో బాధపడ్డాడు.

    రెండో టీ20 కోసం భారత్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్).

  5. ‘20 రూపాయల వాటర్ బాటిల్ కోసం మనిషిని ఇంత కిరాతకంగా చంపేస్తారా?’.. విజయవాడ మృతుడి భార్య ఆవేదన

  6. భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై ఐటీబీపీ డీజీ ఏమన్నారు? విపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి

  7. చెమ్మణి సామూహిక సమాధి: ఒకే చోట దొరికిన 583 అస్థిపంజరాలు ఎవరివి? ‘నరమేధానికి గురైన’ తమిళులవా.. అంటువ్యాధితో మరణించినవారివా?

  8. ‘బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా రొమ్ము తొలగించాల్సిన అవసరం లేదు’

  9. చదవడం, రాయడం మర్చిపోయిన ఈ బాలికకు ఏమైంది?

  10. Ind vs Nz: భారత్ టార్గెట్ 226, పది ఓవర్లకు 119/3

    క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పది ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.

    భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి ఐదు ఓవర్లలో 16 రన్ రేట్‌తో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సంజూ శామ్సన్ 33 బంతుల్లో 67 పరుగులు, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యారు. తిలక్ వర్మ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. క్రీజులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఉన్నారు.

    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజీలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అలెన్ 24 బంతుల్లో 45 పరుగులు చేయగా, సీఫర్ట్ 24 పరుగులు సాధించాడు. డారిల్ మిచెల్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

    నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫిలిప్స్, నాలుగో వికెట్‌కు బెవన్ జాకబ్స్‌తో కలిసి 32 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫిలిప్స్ 40 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు.

    జాకబ్స్ 16 బంతుల్లో మూడు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

    ఈ మ్యాచ్‌తో పేసర్ భువనేశ్వర్ కుమార్ 2022 తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.

  11. దసరా పండుగను అక్కడ 76 రోజుల పాటు జరుపుకుంటారు, కానీ రావణ దహనం మాత్రం ఉండదు

  12. '2022లో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా’ : సౌదీ కఠిన చట్టాలు తెలుసుకోకపోతే ప్రమాదమే

  13. పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ

  14. హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

  15. పంజాబ్‌లో కుటుంబాన్ని తుపాకీతో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్న పోలీస్

    పంజాబ్‌లోని మాన్సాలో పోలీసు కానిస్టేబుల్ కుటుంబంపై కాల్పులు జరిపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

    ఈ కాల్పుల్లో ఒక కుమారుడు చనిపోగా, భార్య, మరో కుమారుడు గాయపడినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

    గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

    ఈ ఘటన ఉదయం 7గంటల ప్రాంతంలో జరిగిందని మాన్సా ఎస్ఎస్సీ చెప్పారు.

    కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు ఆయన పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలిస్తాయని వెల్లడించారు.

    సర్వీస్ తుపాకీతోనే కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు.

    మన్సా డిప్యూటీ కమిషనర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా ఆయన పని చేస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.

    (ఆత్మహత్య అనేది ఒక తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే, భారత ప్రభుత్వానికి చెందిన 'జీవన్ ఆస్థా' (Jeevan Aastha) హెల్ప్‌లైన్ నంబర్ 18002333330 ద్వారా సహాయం పొందవచ్చు. అలాగే, మీ స్నేహితులు, బంధువులతో కూడా మాట్లాడండి.)

  16. ‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్

  17. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. ఫోటోల్లో

  18. ‘‘నన్ను బలవంతంగా టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లాడు, నేను కళ్లు మూసుకుని అక్కడ లేననుకున్నా’’

  19. దసరా: మీకు పాలపిట్ట కనిపించిందా?

  20. ఆస్ట్రేలియా: ఎంపీని కారుతో గుద్ది హత్యాయత్నం

    ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హెయిన్స్‌ను కారు ఢీకొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించారు.

    విక్టోరియాలోని వాంగరట్టాలో తన కార్యాలయం బయట పార్కింగ్‌లో ఉండగా, సోమవారం మధ్యాహ్నం కారు ఢీకొనడంతో హెలెన్ హెయిన్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. అయితే దాడి వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

    హెయిన్స్‌ను ఢీకొట్టడానికి కారు డ్రైవర్ యూ టర్న్ తీసుకు వచ్చినట్టు కనిపిస్తోందని అల్బనీస్ అన్నారు. కారు నడుపుతున్న 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

    హెలెన్ హెయిన్స్ ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో గల ఇండి డివిజన్‌కు చెందిన 65 ఏళ్ల స్వతంత్ర ఎంపీ.

    ఆమె 2019లో తొలిసారిగా ఆస్ట్రేలియన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికయ్యారు. 2022, 2025లలో తిరిగి ఎన్నికయ్యారు.

    రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు ఆమె నర్సుగా, ప్రజారోగ్య పరిశోధకురాలిగా పనిచేశారు.