ప్రపంచ సంక్షోభాలను చూస్తూ ఉండిపోకూడదు: ఐరాసకు జైశంకర్ సూచన
ప్రపంచ సంక్షోభాలను ఐక్యరాజ్యసమితి చూస్తూ ఉండిపోకుండా నాయకత్వ పాత్ర పోషించాలని విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ చెప్పినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ సమ్మేళన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు.
‘‘మనం పరిపూర్ణత లేని ప్రపంచంలో జీవిస్తున్నాం. అయితే, మరింత మెరుగైన ప్రపంచం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనేఉన్నాం. ఐక్యరాజ్యసమితి దానిలోని లోపాలను, పరిమితులను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకుకృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్వామ్యం లేకుండా చేయకూడదు. ప్రపంచ సంక్షోభాలను చూస్తూ ఉండిపోకుండా ఐక్యరాజ్యసమితి నాయకత్వ పాత్ర పోషించాలి” అని జైశంకర్ అన్నారు.