మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

‘ఆస్కార్ అవార్డు ప్రజెంటర్లలో నేనూ ఉన్నా’- ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించిన దీపికా పదుకొణె

డ్వేన్ జాన్సన్, మైఖేల్ జోర్డాన్, రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, గ్లెన్ క్లోజ్, ట్రాయ్ కోట్సర్, జెన్నిఫర్ కానెలీ, సామ్యూల్ జాక్సన్, మెలిసా మెకార్తీ, జో సల్దానా, డానీ యెన్, జొనాథన్ మేజర్స్ కూడా ఈ కార్యక్రమంలో ప్రజెంటర్లుగా వ్యవహరించనున్నారు

లైవ్ కవరేజీ

  1. విశాఖను ఓ వాలంటరీ అసోసియేషన్ పాలించిందని తెలుసా? ఈ ఊరు మున్సిపాల్టీగా ఎప్పుడు మారింది, అప్పట్లో ఎన్ని వార్డులు ఉండేవి?

  2. మణిపుర్: ‘కట్టెల కోసం అడవికి వెళితే, మా అబ్బాయిని చంపేశారు.. నాలుగేళ్ల నా మనవరాలు నాన్న ఎక్కడ అంటోంది’

  3. న్యూజీలాండ్‌తో రెండో టీ ట్వంటీలో భారత్ విజయం

    న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.

    ఉత్కంఠగా సాగిన పోరులో కివీస్ జట్టు నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది.

    మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

    గ్లెన్ ఫిలిప్స్ 43 బంతుల్లో 77 పరుగులు చేయగా, బెవాన్ జాకబ్స్ 46 బంతుల్లో 58 పరుగులు చేశాడు.

    భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసి జట్టును విజయపథంలో నడిపాడు.

    ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని అందించారు.

    కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 4 వికెట్లు తీశాడు.

    ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.

  4. కళ్లద్దాలతో స్పష్టంగా కనిపిస్తే కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లేనా? చూపు తగ్గుతోందని ఎలా గుర్తించాలి?

  5. అజర్‌బైజాన్‌: దేవనాగరి లిపిలో 'శ్రీ గణేశాయ నమః' అని రాసి ఉన్న ఈ అగ్ని దేవాలయ చరిత్ర ఏమిటి?

  6. అల్లూరి జిల్లాలో పేలుడు, ఐదుగురి మృతి, లక్కోజు శ్రీనివాస్

    ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన పేలుడు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

    అనంతగిరి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు పాడేరు ఎస్పీ కార్యాలయం తెలిపింది. ఇది ప్రమాదమేనని ప్రాధమికంగా నిర్థరించినట్లు పోలీసులు బీబీసీకి తెలిపారు.

    “రోడ్డు నిర్మాణ పనుల్లో ఉపయోగించే పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న వాహనంలో అనంతగిరి మండలంలోని పినకోట సమీపంలో డీజిల్ నింపడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్థరణ జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. మృతుల్లో ఒక ప్రభుత్వ టీచర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది” అని ఈ కేసును పర్యవేక్షిస్తున్న అనంతగిరి ఎస్ఐ శంకర్రావు బీబీసీకి తెలిపారు.

    ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అల్లూరి జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

    ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

    మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

  7. ఏఐతో చేసే మోసాలను తెలుసుకోవడం ఎలా, ఏమేం గమనించాలి?

  8. ఆంధ్రప్రదేశ్: ‘‘పొంచివున్న తుపాను ముప్పు’’.. ఏయే జిల్లాల్లో అంటే..

    ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచివున్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారనుందని హెచ్చరించింది.

    ముఖ్యమైన హెచ్చరికలు, వివరాలు:

    • అల్పపీడనం బలపడే తీరు: ఆగ్నేయ, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 25 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.
    • ఇది అక్టోబర్ 26 నాటికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మరే అవకాశం ఉందని, ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనించనుందని అంచనా వేశారు.
    • భారీ వర్షాలు: ఈ ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీలలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
    • విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో అతి తీవ్ర వర్షాలు కురిసే సూచనలున్నాయి.
    • ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 120 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో (అప్పుడప్పుడు 185 కిలోమీటర్లు) తీవ్ర తుపాను గాలులు వీచే అవకాశం ఉంది.
    • మత్స్యకారులకు హెచ్చరిక: సముద్రం అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
    • ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించారు.
  9. టీమిండియా న్యూజీలాండ్ టూర్: ఇషాన్ కిషాన్ స్థానంలో ఎవరంటే...?

    న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఇషాన్ కిషన్‌ స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ కుమార్‌ కుశాగ్రాను రెండో టీ20 మ్యాచ్ కోసం భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.

    ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్‌లో ఇండియా 'ఏ' జట్టుతో ఉన్న కుశాగ్రా, ఈ మ్యాచ్ కోసం భారత జట్టుతో కలవనున్నాడు.

    తొలి టీ20లో ఇషాన్ కిషన్ కుడి తొడ కండరాల గాయం (రైట్ అడక్టర్ స్ట్రెయిన్)తో బాధపడ్డాడు.

    రెండో టీ20 కోసం భారత్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్).

  10. కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారంటూ పదేపదే వదంతులు, ఎందుకిలా?

  11. ‘20 రూపాయల వాటర్ బాటిల్ కోసం మనిషిని ఇంత కిరాతకంగా చంపేస్తారా?’.. విజయవాడ మృతుడి భార్య ఆవేదన

  12. భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై ఐటీబీపీ డీజీ ఏమన్నారు? విపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి

  13. ‘బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా రొమ్ము తొలగించాల్సిన అవసరం లేదు’

  14. ఇరాన్: అలీ ఖమేనీ వీలునామా అమెరికా దాడిలో ధ్వంసమైపోయిందా? ఇంతకీ అందులో ఏం రాశారు

  15. అటకపై దాచిన పోకీమాన్ కార్డులకు వేలంలో దాదాపు రూ.20 కోట్లు వచ్చాయి

  16. చదవడం, రాయడం మర్చిపోయిన ఈ బాలికకు ఏమైంది?

  17. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు కొత్త షెడ్యూల్, నవంబర్ 1న పోలింగ్, 3న లెక్కింపు

    ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురువారం రాత్రి విడుదల చేసింది.

    తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయితీలకు సంబంధించిన పోలింగ్ నవంబర్ 1న జరపనున్నారు. అవసరమైన చోట్ల రెండో తేదీన రీపోలింగ్ నిర్వహిస్తారు. మూడో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

    వాస్తవంగా అక్టోబర్ 14న నోటిఫికేషన్ ప్రకారం 16వ తేదీ నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించారు. 19న అధికారులు నామినేషన్లను పరిశీలించారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం కల్పించారు. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో షెడ్యూల్ మారింది.

    అభ్యర్థుల తుది జాబితా ప్రకటన 25వ తేదీ వరకు వాయిదా వేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈలోగా పిటిషనర్ పార్టీ(వైసీపీ), లేదా వివిధ అభ్యర్థులు సమర్పించిన విన్నపాలు పరిశీలించాలని కోర్టు సూచించింది.

    సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి తదుపరి ఎన్నికల ప్రక్రియను ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఘర్షణలు జరిగిన 4 పట్టణాల్లో అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. శనివారం (24 అక్టోబర్ 2026) 3 గంటల వరకు నామపత్రాలు దాఖలు చేయవచ్చు.

    మైదుకూరులోని అన్ని వార్డులు, రాజంపేటలోని 11 వార్డులకు, కడప కార్పొరేషన్‌లోని 11, తిరుపతిలోని 18 డివిజన్లలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అక్టోబర్ 25వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. అదే రోజు ఉపసంహరణకు గడువు విధిస్తున్నట్టు నోటిఫికేషన్ సవరించారు.

  18. వైఎస్‌ జగన్‌ రూటు మారుతోందా? 'ఏపీలో మేమే కాక్రోచ్'.. 'సీఈసీ నియామకానికి మద్దతివ్వడంపై రిగ్రెట్ అవుతున్నాం' వ్యాఖ్యల మర్మమేమిటి?

  19. 58 మంది పిల్లలున్న ఓ తండ్రి కథ.. ‘రాత్రి పడుకునే ముందు అందరూ ఉన్నారో లేదో లెక్కపెడతాను’

  20. ‘ఐ డోంట్‌ కేర్‌.. గెలిస్తే గెలుస్తా, లేదంటే ఓడిపోతా.. ఫైట్ అయితే తప్పదు’.. ఏబీ వెంకటేశ్వరరావు బీబీసీ ఇంటర్వ్యూలో ఇంకా ఏమేం చెప్పారు?