మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

సీబీఐ: మెహుల్ చోక్సీ రెడ్ కార్నర్ నోటీస్ కోసం మళ్లీ అప్పీలు చేస్తాం

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సంబంధించిన రూ.13,000 కోట్ల కుంభకోణంలో మెహుల్ చోక్సీ ప్రధాన నిందితునిగా ఉన్నారు.

లైవ్ కవరేజీ

  1. ప్రపంచ సంక్షోభాలను చూస్తూ ఉండిపోకూడదు: ఐరాసకు జైశంకర్ సూచన

    ప్రపంచ సంక్షోభాలను ఐక్యరాజ్యసమితి చూస్తూ ఉండిపోకుండా నాయకత్వ పాత్ర పోషించాలని విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ చెప్పినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

    ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్‌ సమ్మేళన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు.

    ‘‘మనం పరిపూర్ణత లేని ప్రపంచంలో జీవిస్తున్నాం. అయితే, మరింత మెరుగైన ప్రపంచం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనేఉన్నాం. ఐక్యరాజ్యసమితి దానిలోని లోపాలను, పరిమితులను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకుకృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్వామ్యం లేకుండా చేయకూడదు. ప్రపంచ సంక్షోభాలను చూస్తూ ఉండిపోకుండా ఐక్యరాజ్యసమితి నాయకత్వ పాత్ర పోషించాలి” అని జైశంకర్ అన్నారు.

  2. ‘మణిపుర్‌లో శాశ్వత శాంతి స్థాపన కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం’

    మణిపుర్‌లో శాశ్వత శాంతిని నెలకొల్పే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్త కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ తెలిపారు.

    రాష్ట్రంలోని అధికారికంగా గుర్తించిన 33 షెడ్యూల్డ్ తెగలతో సహా మొత్తం 36 వర్గాల నుండి ఈ కమిటీలో ప్రతినిధులు ఉంటారని ఆయన అన్నారు.

    శనివారం ఇంఫాల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఖేమ్‌చంద్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో ఈ శాంతి కమిటీ ప్రాధాన్యం గురించి చర్చించినట్లు తెలిపారు.

    ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించేందుకు ఖేమ్‌చంద్ సింగ్ ఈ నెల అక్టోబర్ 10న న్యూదిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

    యాదృచ్ఛికంగా, అదే రోజు మణిపుర్‌లో భారీ హింస చెలరేగింది. 12 గంటల వ్యవధిలో కామ్‌జోంగ్, కాంగ్‌పోక్పిఉఖ్రుల్ జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో తొమ్మిది మంది మరణించారు.

    మే 3, 2023 నుంచి మెయితీ సమాజానికి, కుకీ తెగకు మధ్య కొనసాగుతున్న హింస ఈ ఏడాది కొంతమేరకు సద్దుమణిగింది. అయితే, ఫిబ్రవరిలో ఉఖ్రుల్ జిల్లాలో కుకీ, నాగా యువకుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత పరిస్థితి మళ్లీ తీవ్రరూపం దాల్చింది.

    దాదాపు ఎనిమిది నెలల క్రితం ప్రారంభమైన నాగ-కుకీ ఘర్షణలో ఇప్పటివరకు కనీసం 22 మంది నాగాలు, 31 మంది కుకీలు మరణించారు. మైతేయి, కుకీ, నాగ వర్గాల మధ్య నెలకొన్న ఈ త్రిముఖ ఉద్రిక్తత రాష్ట్ర ప్రభుత్వానికి సవాళ్లను మరింత తీవ్రతరం చేసింది.

  3. బీజేపీకి రాహుల్ థాంక్స్, ‘ఈ 7రోజులు అదే ఉత్సాహంతో ఉండండి’

    కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవంబర్ 1న ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

    సర్‌లో అవకతవకలకు సంబంధించి నవంబర్ 1న దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో ఇండీ కూటమి భారీ ర్యాలీ నిర్వహించనుంది.

    ఈ విషయమై రాహుల్ గాంధీ ఆదివారం 'ఎక్స్'లో ఓ పోస్టు చేశారు. "మా ఓట్లను దొంగిలిస్తున్నారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారు. నియమ నిబంధనలను ఉల్లంఘించారు. ప్రశ్నలు అడిగిన వారిపై లాఠీఛార్జ్ చేశారు." అని రాశారు.

    విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, వ్యాపారవేత్తలు—ప్రజాస్వామ్యం పట్ల శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ నవంబర్ 1న జరిగే ర్యాలీకి తప్పక రావాలి. ఓటు మీదే. పోరాటం మీదే అని పిలుపునిచ్చారు.

    "ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా ప్రచారం చేసి, వీలైనంత ఎక్కువ మందికి చేరేలా చేసినందుకు బీజేపీకి, దాని మిత్రపక్షాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే ఏడు రోజులు కూడా ఇదే ఉత్సాహాన్ని, అంకితభావాన్ని కొనసాగించండి!" అని రాహుల్ రాశారు.

    మరోవైపు, నవంబర్ 10 తర్వాత ఈ ర్యాలీని నిర్వహించాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసింది.

    రద్దీగా ఉండే దీపావళి షాపింగ్ సీజన్‌లో ఈ ర్యాలీ వల్ల దిల్లీ వ్యాపారాలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లవచ్చని వాణిజ్య సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

  4. మణిపుర్: ‘కట్టెల కోసం అడవికి వెళితే, మా అబ్బాయిని చంపేశారు.. నాలుగేళ్ల నా మనవరాలు నాన్న ఎక్కడ అంటోంది’

  5. న్యూజీలాండ్‌తో రెండో టీ ట్వంటీలో భారత్ విజయం

    న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.

    ఉత్కంఠగా సాగిన పోరులో కివీస్ జట్టు నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది.

    మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

    గ్లెన్ ఫిలిప్స్ 43 బంతుల్లో 77 పరుగులు చేయగా, బెవాన్ జాకబ్స్ 46 బంతుల్లో 58 పరుగులు చేశాడు.

    భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసి జట్టును విజయపథంలో నడిపాడు.

    ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని అందించారు.

    కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 4 వికెట్లు తీశాడు.

    ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.

  6. కళ్లద్దాలతో స్పష్టంగా కనిపిస్తే కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లేనా? చూపు తగ్గుతోందని ఎలా గుర్తించాలి?

  7. అజర్‌బైజాన్‌: దేవనాగరి లిపిలో 'శ్రీ గణేశాయ నమః' అని రాసి ఉన్న ఈ అగ్ని దేవాలయ చరిత్ర ఏమిటి?

  8. టీమిండియా న్యూజీలాండ్ టూర్: ఇషాన్ కిషాన్ స్థానంలో ఎవరంటే...?

    న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఇషాన్ కిషన్‌ స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ కుమార్‌ కుశాగ్రాను రెండో టీ20 మ్యాచ్ కోసం భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.

    ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్‌లో ఇండియా 'ఏ' జట్టుతో ఉన్న కుశాగ్రా, ఈ మ్యాచ్ కోసం భారత జట్టుతో కలవనున్నాడు.

    తొలి టీ20లో ఇషాన్ కిషన్ కుడి తొడ కండరాల గాయం (రైట్ అడక్టర్ స్ట్రెయిన్)తో బాధపడ్డాడు.

    రెండో టీ20 కోసం భారత్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్).

  9. భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై ఐటీబీపీ డీజీ ఏమన్నారు? విపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి

  10. ‘బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా రొమ్ము తొలగించాల్సిన అవసరం లేదు’

  11. చదవడం, రాయడం మర్చిపోయిన ఈ బాలికకు ఏమైంది?

  12. Ind vs Nz: భారత్ టార్గెట్ 226, పది ఓవర్లకు 119/3

    క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పది ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.

    భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి ఐదు ఓవర్లలో 16 రన్ రేట్‌తో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సంజూ శామ్సన్ 33 బంతుల్లో 67 పరుగులు, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యారు. తిలక్ వర్మ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. క్రీజులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఉన్నారు.

    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజీలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అలెన్ 24 బంతుల్లో 45 పరుగులు చేయగా, సీఫర్ట్ 24 పరుగులు సాధించాడు. డారిల్ మిచెల్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

    నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫిలిప్స్, నాలుగో వికెట్‌కు బెవన్ జాకబ్స్‌తో కలిసి 32 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫిలిప్స్ 40 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు.

    జాకబ్స్ 16 బంతుల్లో మూడు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

    ఈ మ్యాచ్‌తో పేసర్ భువనేశ్వర్ కుమార్ 2022 తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.

  13. దసరా పండుగను అక్కడ 76 రోజుల పాటు జరుపుకుంటారు, కానీ రావణ దహనం మాత్రం ఉండదు

  14. పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ

  15. ‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్

  16. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. ఫోటోల్లో

  17. దసరా: మీకు పాలపిట్ట కనిపించిందా?

  18. సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన

  19. ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు భారీ ఊరట, అమెరికాలో వ్యతిరేకత పెరగనుందా?

  20. మార్కో రూబియో భారత పర్యటనలో దిల్లీ ఎందుకు లేదు, జై శంకర్ ఆయనను కలవడానికి ముంబయి వెళ్లడంపై విమర్శలు ఏంటి?