మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
వైఎస్ వివేకా హత్య కేసు: రేపు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
లైవ్ కవరేజీ
‘తుపాను వస్తోంది ఈ జాగ్రత్తలు తీసుకోండి’ - ఏపీఎస్డీఎంఏ, గరికిపాటి ఉమాకాంత్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారనుందని, బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి సమీపంలో చేరే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
దీని ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
వర్షాల అంచనా:
- ఆదివారం - 25-10-2026): కృష్ణా, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- మంగళ, బుధవారాలు: చెదురుమదురుగా అత్యంత భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
అత్యవసర సహాయ నంబర్లు: ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఏవైనా అత్యవసర సహాయాలు లేదా సమాచారం కోసం 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
- విపత్తుల సంస్థ, ఆర్టీజిఎస్, ఐఎండి పంపే వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
- విలువైన పత్రాలు, సర్టిఫికెట్లను వాటర్ ప్రూఫ్ కవర్లలో భద్రపరుచుకోవాలి.
- కనీసం ఒక వారానికి సరిపడా ఆహార పదార్థాలు, తాగునీరు సిద్ధం చేసుకోవాలి.
- ఇంటి పైకప్పు, తలుపులు, కిటికీలు సురక్షితంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి.
- తుపాను సమయంలో ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి, గ్యాస్ కనెక్షన్లను తొలగించాలి.
- ఇల్లు సురక్షితంగా లేదని భావిస్తే ముందే పునరావాస కేంద్రాలకు వెళ్లాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.
- లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎత్తైన, సురక్షితమైన ప్రాంతాలకు తరలివెళ్లాలి.
- మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదు. పడవలు, తెప్పలను సురక్షిత ప్రాంతాల్లో బలమైన తాడులతో గట్టిగా కట్టాలి.
బీజేపీకి రాహుల్ థాంక్స్, ‘ఈ 7రోజులు అదే ఉత్సాహంతో ఉండండి’
కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవంబర్ 1న ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సర్‌లో అవకతవకలకు సంబంధించి నవంబర్ 1న దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో ఇండీ కూటమి భారీ ర్యాలీ నిర్వహించనుంది.
ఈ విషయమై రాహుల్ గాంధీ ఆదివారం 'ఎక్స్'లో ఓ పోస్టు చేశారు. "మా ఓట్లను దొంగిలిస్తున్నారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారు. నియమ నిబంధనలను ఉల్లంఘించారు. ప్రశ్నలు అడిగిన వారిపై లాఠీఛార్జ్ చేశారు." అని రాశారు.
విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, వ్యాపారవేత్తలు—ప్రజాస్వామ్యం పట్ల శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ నవంబర్ 1న జరిగే ర్యాలీకి తప్పక రావాలి. ఓటు మీదే. పోరాటం మీదే అని పిలుపునిచ్చారు.
"ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా ప్రచారం చేసి, వీలైనంత ఎక్కువ మందికి చేరేలా చేసినందుకు బీజేపీకి, దాని మిత్రపక్షాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే ఏడు రోజులు కూడా ఇదే ఉత్సాహాన్ని, అంకితభావాన్ని కొనసాగించండి!" అని రాహుల్ రాశారు.
మరోవైపు, నవంబర్ 10 తర్వాత ఈ ర్యాలీని నిర్వహించాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసింది.
రద్దీగా ఉండే దీపావళి షాపింగ్ సీజన్లో ఈ ర్యాలీ వల్ల దిల్లీ వ్యాపారాలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లవచ్చని వాణిజ్య సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
విశాఖను ఓ వాలంటరీ అసోసియేషన్ పాలించిందని తెలుసా? ఈ ఊరు మున్సిపాల్టీగా ఎప్పుడు మారింది, అప్పట్లో ఎన్ని వార్డులు ఉండేవి?
మణిపుర్: ‘కట్టెల కోసం అడవికి వెళితే, మా అబ్బాయిని చంపేశారు.. నాలుగేళ్ల నా మనవరాలు నాన్న ఎక్కడ అంటోంది’
దీపావళికి ముందు బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి?
న్యూజీలాండ్‌తో రెండో టీ ట్వంటీలో భారత్ విజయం
న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.
ఉత్కంఠగా సాగిన పోరులో కివీస్ జట్టు నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
గ్లెన్ ఫిలిప్స్ 43 బంతుల్లో 77 పరుగులు చేయగా, బెవాన్ జాకబ్స్ 46 బంతుల్లో 58 పరుగులు చేశాడు.
భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసి జట్టును విజయపథంలో నడిపాడు.
ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని అందించారు.
కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 4 వికెట్లు తీశాడు.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.
కళ్లద్దాలతో స్పష్టంగా కనిపిస్తే కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లేనా? చూపు తగ్గుతోందని ఎలా గుర్తించాలి?
అజర్బైజాన్: దేవనాగరి లిపిలో 'శ్రీ గణేశాయ నమః' అని రాసి ఉన్న ఈ అగ్ని దేవాలయ చరిత్ర ఏమిటి?
అల్లూరి జిల్లాలో పేలుడు, ఐదుగురి మృతి, లక్కోజు శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన పేలుడు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
అనంతగిరి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు పాడేరు ఎస్పీ కార్యాలయం తెలిపింది. ఇది ప్రమాదమేనని ప్రాధమికంగా నిర్థరించినట్లు పోలీసులు బీబీసీకి తెలిపారు.
“రోడ్డు నిర్మాణ పనుల్లో ఉపయోగించే పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న వాహనంలో అనంతగిరి మండలంలోని పినకోట సమీపంలో డీజిల్ నింపడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్థరణ జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. మృతుల్లో ఒక ప్రభుత్వ టీచర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది” అని ఈ కేసును పర్యవేక్షిస్తున్న అనంతగిరి ఎస్ఐ శంకర్రావు బీబీసీకి తెలిపారు.
ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అల్లూరి జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్: ‘‘పొంచివున్న తుపాను ముప్పు’’.. ఏయే జిల్లాల్లో అంటే..
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచివున్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారనుందని హెచ్చరించింది.
ముఖ్యమైన హెచ్చరికలు, వివరాలు:
- అల్పపీడనం బలపడే తీరు: ఆగ్నేయ, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 25 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.
- ఇది అక్టోబర్ 26 నాటికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మరే అవకాశం ఉందని, ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనించనుందని అంచనా వేశారు.
- భారీ వర్షాలు: ఈ ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీలలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో అతి తీవ్ర వర్షాలు కురిసే సూచనలున్నాయి.
- ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 120 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో (అప్పుడప్పుడు 185 కిలోమీటర్లు) తీవ్ర తుపాను గాలులు వీచే అవకాశం ఉంది.
- మత్స్యకారులకు హెచ్చరిక: సముద్రం అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
- ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించారు.
టీమిండియా న్యూజీలాండ్ టూర్: ఇషాన్ కిషాన్ స్థానంలో ఎవరంటే...?
న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఇషాన్ కిషన్ స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ కుమార్ కుశాగ్రాను రెండో టీ20 మ్యాచ్ కోసం భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.
ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్‌లో ఇండియా 'ఏ' జట్టుతో ఉన్న కుశాగ్రా, ఈ మ్యాచ్ కోసం భారత జట్టుతో కలవనున్నాడు.
తొలి టీ20లో ఇషాన్ కిషన్ కుడి తొడ కండరాల గాయం (రైట్ అడక్టర్ స్ట్రెయిన్)తో బాధపడ్డాడు.
రెండో టీ20 కోసం భారత్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్).
‘20 రూపాయల వాటర్ బాటిల్ కోసం మనిషిని ఇంత కిరాతకంగా చంపేస్తారా?’.. విజయవాడ మృతుడి భార్య ఆవేదన
భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై ఐటీబీపీ డీజీ ఏమన్నారు? విపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి
‘బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా రొమ్ము తొలగించాల్సిన అవసరం లేదు’
ఇరాన్: అలీ ఖమేనీ వీలునామా అమెరికా దాడిలో ధ్వంసమైపోయిందా? ఇంతకీ అందులో ఏం రాశారు
అటకపై దాచిన పోకీమాన్ కార్డులకు వేలంలో దాదాపు రూ.20 కోట్లు వచ్చాయి
చదవడం, రాయడం మర్చిపోయిన ఈ బాలికకు ఏమైంది?
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు కొత్త షెడ్యూల్, నవంబర్ 1న పోలింగ్, 3న లెక్కింపు
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురువారం రాత్రి విడుదల చేసింది.
తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయితీలకు సంబంధించిన పోలింగ్ నవంబర్ 1న జరపనున్నారు. అవసరమైన చోట్ల రెండో తేదీన రీపోలింగ్ నిర్వహిస్తారు. మూడో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
వాస్తవంగా అక్టోబర్ 14న నోటిఫికేషన్ ప్రకారం 16వ తేదీ నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించారు. 19న అధికారులు నామినేషన్లను పరిశీలించారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం కల్పించారు. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో షెడ్యూల్ మారింది.
అభ్యర్థుల తుది జాబితా ప్రకటన 25వ తేదీ వరకు వాయిదా వేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈలోగా పిటిషనర్ పార్టీ(వైసీపీ), లేదా వివిధ అభ్యర్థులు సమర్పించిన విన్నపాలు పరిశీలించాలని కోర్టు సూచించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి తదుపరి ఎన్నికల ప్రక్రియను ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఘర్షణలు జరిగిన 4 పట్టణాల్లో అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. శనివారం (24 అక్టోబర్ 2026) 3 గంటల వరకు నామపత్రాలు దాఖలు చేయవచ్చు.
మైదుకూరులోని అన్ని వార్డులు, రాజంపేటలోని 11 వార్డులకు, కడప కార్పొరేషన్‌లోని 11, తిరుపతిలోని 18 డివిజన్లలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అక్టోబర్ 25వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. అదే రోజు ఉపసంహరణకు గడువు విధిస్తున్నట్టు నోటిఫికేషన్ సవరించారు.
వైఎస్ జగన్ రూటు మారుతోందా? 'ఏపీలో మేమే కాక్రోచ్'.. 'సీఈసీ నియామకానికి మద్దతివ్వడంపై రిగ్రెట్ అవుతున్నాం' వ్యాఖ్యల మర్మమేమిటి?