ఆసియా కప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
ఫైనల్ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతోంది, దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.
లైవ్ కవరేజీ
భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై ఐటీబీపీ డీజీ ఏమన్నారు? విపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి
‘బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా రొమ్ము తొలగించాల్సిన అవసరం లేదు’
ఇరాన్: అలీ ఖమేనీ వీలునామా అమెరికా దాడిలో ధ్వంసమైపోయిందా? ఇంతకీ అందులో ఏం రాశారు
న్యూజీలాండ్‌తో జరిగే రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌తో జరిగే రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం న్యూజీలాండ్‌తో జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు ఇషాన్ కిషన్ గాయపడ్డాడు.
తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఆకట్టుకోలేకపోయాడు.
ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతను కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
అటకపై దాచిన పోకీమాన్ కార్డులకు వేలంలో దాదాపు రూ.20 కోట్లు వచ్చాయి
చదవడం, రాయడం మర్చిపోయిన ఈ బాలికకు ఏమైంది?
టిబెట్‌లో భూకంపం, 16 మంది చనిపోయినట్టు చైనా మీడియా ప్రకటన

ఫొటో సోర్స్, CCTV via Reuters
ఫొటో క్యాప్షన్, టిబెట్‌లో భూకంపం చైనా ప్రభుత్వ మీడియా నివేదికల ప్రకారం, టిబెట్‌లోని పర్వత ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం వచ్చింది.
కనీసం 16 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
గురువారం రాత్రి సంభవించిన భూకంప కేంద్రం నాగ్చు ప్రాంతంలోని బాకెన్ కౌంటీలో ఉందని, స్థానిక అత్యవసర నిర్వహణ బ్యూరోను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
బాకెన్ కౌంటీ టిబెట్ రాజధాని లాసాకు ఈశాన్యంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించి, ప్రభావిత ప్రాంతానికి సహాయక బృందాలను పంపించారు. అక్కడ మరో 32 మంది కూడా గాయపడ్డారు.
స్థానిక నివేదికల ప్రకారం, ప్రభావిత ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 339 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో రహదారులు మూసుకుపోయాయి, ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవడం మరింత కష్టంగా మారింది.
టిబెట్‌లోని ఖమ్డో, నింగ్చి నగరాల్లో కూడా బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు కొత్త షెడ్యూల్, నవంబర్ 1న పోలింగ్, 3న లెక్కింపు

ఫొటో సోర్స్, Vizag DPRO
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు కొత్త షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురువారం రాత్రి విడుదల చేసింది.
తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయితీలకు సంబంధించిన పోలింగ్ నవంబర్ 1న జరపనున్నారు. అవసరమైన చోట్ల రెండో తేదీన రీపోలింగ్ నిర్వహిస్తారు. మూడో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
వాస్తవంగా అక్టోబర్ 14న నోటిఫికేషన్ ప్రకారం 16వ తేదీ నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించారు. 19న అధికారులు నామినేషన్లను పరిశీలించారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం కల్పించారు. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో షెడ్యూల్ మారింది.
అభ్యర్థుల తుది జాబితా ప్రకటన 25వ తేదీ వరకు వాయిదా వేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈలోగా పిటిషనర్ పార్టీ(వైసీపీ), లేదా వివిధ అభ్యర్థులు సమర్పించిన విన్నపాలు పరిశీలించాలని కోర్టు సూచించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి తదుపరి ఎన్నికల ప్రక్రియను ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఘర్షణలు జరిగిన 4 పట్టణాల్లో అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. శనివారం (24 అక్టోబర్ 2026) 3 గంటల వరకు నామపత్రాలు దాఖలు చేయవచ్చు.
మైదుకూరులోని అన్ని వార్డులు, రాజంపేటలోని 11 వార్డులకు, కడప కార్పొరేషన్‌లోని 11, తిరుపతిలోని 18 డివిజన్లలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అక్టోబర్ 25వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. అదే రోజు ఉపసంహరణకు గడువు విధిస్తున్నట్టు నోటిఫికేషన్ సవరించారు.
పీహెచ్‌పీ: కొన్ని ప్రముఖ వెబ్సైట్లు ఎందుకు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయి, ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఈ సైబర్ ముప్పు ఏంటి?
వైఎస్ జగన్ రూటు మారుతోందా? 'ఏపీలో మేమే కాక్రోచ్'.. 'సీఈసీ నియామకానికి మద్దతివ్వడంపై రిగ్రెట్ అవుతున్నాం' వ్యాఖ్యల మర్మమేమిటి?
58 మంది పిల్లలున్న ఓ తండ్రి కథ.. ‘రాత్రి పడుకునే ముందు అందరూ ఉన్నారో లేదో లెక్కపెడతాను’
మూత్రనాళ ఇన్ఫెక్షన్: గర్భిణులు తీసుకోవాల్సిన 8 జాగ్రత్తలు
‘ఐ డోంట్ కేర్.. గెలిస్తే గెలుస్తా, లేదంటే ఓడిపోతా.. ఫైట్ అయితే తప్పదు’.. ఏబీ వెంకటేశ్వరరావు బీబీసీ ఇంటర్వ్యూలో ఇంకా ఏమేం చెప్పారు?
Ind vs Nz: భారత్ టార్గెట్ 226, పది ఓవర్లకు 119/3

ఫొటో సోర్స్, Kai Schwoerer/Getty Images
ఫొటో క్యాప్షన్, 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పది ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి ఐదు ఓవర్లలో 16 రన్ రేట్‌తో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సంజూ శామ్సన్ 33 బంతుల్లో 67 పరుగులు, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యారు. తిలక్ వర్మ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. క్రీజులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజీలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అలెన్ 24 బంతుల్లో 45 పరుగులు చేయగా, సీఫర్ట్ 24 పరుగులు సాధించాడు. డారిల్ మిచెల్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫిలిప్స్, నాలుగో వికెట్‌కు బెవన్ జాకబ్స్‌తో కలిసి 32 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫిలిప్స్ 40 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు.
జాకబ్స్ 16 బంతుల్లో మూడు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌తో పేసర్ భువనేశ్వర్ కుమార్ 2022 తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
దసరా పండుగను అక్కడ 76 రోజుల పాటు జరుపుకుంటారు, కానీ రావణ దహనం మాత్రం ఉండదు
స్థానిక సంస్థల ఎన్నికలు: తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

ఫొటో సోర్స్, I & PR Andhra Pradesh
ఫొటో క్యాప్షన్, అనిల్ చంద్ర పునేఠా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 19 ప్రాంతాల్లోనే ఆపాలని భావించినా, ఇప్పుడు మొత్తం 100 స్థానాల్లో ఆపేస్తున్నట్లు పేర్కొంది.
అభ్యర్థుల జాబితా ప్రకటన ఈ నెల 25 వరకు వాయిదా వేయడంపై ఇవాళ నిర్ణయించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీల నివేదికల ఆధారంగా తుది నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో నామినేషన్లు వేసే అవకాశం తమ పార్టీ అభ్యర్థులకు కల్పించలేదని సుప్రీంకోర్టులో వైసీపీ పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దని ఆదేశించింది. గురువారం ఒక నిర్ణయం ప్రకటించాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలపై బుధవారం న్యాయనిపుణులతో చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా నోటిఫికేషన్ వచ్చిన 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల గడువుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
‘ఫోటో ఆధారంగా అనారోగ్యాన్ని, ఎంత కాలం జీవించే అవకాశముందో చెప్పేసే ఏఐ టూల్’
