అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
దీపావళికి ముందు బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి?
న్యూజీలాండ్‌తో రెండో టీ ట్వంటీలో భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, తిలక్ వర్మ 26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు. న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.
ఉత్కంఠగా సాగిన పోరులో కివీస్ జట్టు నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
గ్లెన్ ఫిలిప్స్ 43 బంతుల్లో 77 పరుగులు చేయగా, బెవాన్ జాకబ్స్ 46 బంతుల్లో 58 పరుగులు చేశాడు.
భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసి జట్టును విజయపథంలో నడిపాడు.
ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని అందించారు.
కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 4 వికెట్లు తీశాడు.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.
“పీస్ బాండ్ పేపర్ల మీద సంతకం చేయనన్నాను”- నేహా బోరా
శాంతి ఒప్పందంపై తాను సంతకం చేయబోనని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా చెప్పారు.
పీస్ బాండ్ నోటీస్‌ను సవాలు చేస్తూ నేహా బోరా దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
“పీస్ బాండ్‌మీద సంతకం చేయను. రాజ్యాంగం మనకు నిరసన తెలిపే హక్కుతో సహా అనేక హక్కులను కల్పించింది. దీంతో పాటు పీస్ బాండ్ కూడా ఉంది. అయితే ఈ బాండ్‌ను వాడుతున్న తీరు చూస్తుంటే దానిపై సంతకం చేయడం మన ప్రాథమిక హక్కులకు విరుద్ధం అవుతుంది” అని ఆమె అన్నారు.
పీస్ బాండ్ మీద సంతకం చేయడం దేశంలో ప్రజాస్వామిక, శాంతియుత నిరసనను అణచివేయడానికి ఇదొక సంకేతంగా మారుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
“ఇలాంటి చర్యలను ఐసా అనుమతించదు. ఇవి మొదట సాధారణంగా కనిపించవచ్చు. కానీ వాటిని అడ్డం పెట్టుకుని నిరసనలను కట్టడి చేస్తారు” అని నేహా బోరా అన్నారు.
అక్టోబర్ 16న 'లెహరా దో తిరంగా' నిరసనలో పాల్గొన్న తర్వాత, విచారణ సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికి రూ. 10,000 వ్యక్తిగత పూచీకత్తు, ఒక ష్యూరిటీని సమర్పించాలన్న నోటీసును నేహా బోరా సవాలు చేశారు.

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, పీస్ బాండ్లను అడ్డం పెట్టుకుని నిరసన చేసే హక్కును హరించడాన్ని ఐసా అనుమతించదని నేహా బోరా అన్నారు. కళ్లద్దాలతో స్పష్టంగా కనిపిస్తే కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లేనా? చూపు తగ్గుతోందని ఎలా గుర్తించాలి?
పాకిస్తాన్‌లో రూ. 7 వేలు దాటిన సిలిండర్ ధర

ఫొటో సోర్స్, PHILIPPE LOPEZ/AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో ఎల్‌పీజీ ధర పెరిగింది (ఫైల్ ఫోటో) పాకిస్తాన్‌లో వంట గ్యాస్ ధరలు పెరిగాయి.
పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఎల్పీజీ ధర కిలోకు 600 రూపాయలు దాటిందని బీబీసీ ఉర్ధూ కథనం తెలిపింది. గత వారం సుమారు 4,500 రూపాయలుగా ఉన్న 11.67 కేజీల సిలిండర్ ధర 7,000 రూపాయలకు పెరిగింది.
పాకిస్తాన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ కూడా తన ద్రవ్యోల్బణ గణాంకాలలో ఎల్‌పీజీ ధరలలో పెరుగుదలను ధృవీకరించింది.
గత వారంతో పోలిస్తే ఈ వారం చివరి నాటికి ఎల్‌పీజీ ధరలు 22.50 శాతం పెరిగాయని ఫెడరల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.
గతేడాది అక్టోబరులో ఇదే వారంతో పోలిస్తే ధరలు 107 శాతం పెరిగాయి.
గమనిక: ఈ వార్తలో రూపాయి అంటే పాకిస్తానీ రూపాయి అని గుర్తించగలరు.
అజర్‌బైజాన్: దేవనాగరి లిపిలో 'శ్రీ గణేశాయ నమః' అని రాసి ఉన్న ఈ అగ్ని దేవాలయ చరిత్ర ఏమిటి?
అల్లూరి జిల్లాలో పేలుడు, ఐదుగురి మృతి, లక్కోజు శ్రీనివాస్

ఫొటో సోర్స్, UGC
ఫొటో క్యాప్షన్, అనంతగిరి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు పాడేరు ఎస్పీ కార్యాలయం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన పేలుడు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
అనంతగిరి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ కేసు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు పాడేరు ఎస్పీ కార్యాలయం తెలిపింది. ఇది ప్రమాదమేనని ప్రాధమికంగా నిర్థరించినట్లు పోలీసులు బీబీసీకి తెలిపారు.
“రోడ్డు నిర్మాణ పనుల్లో ఉపయోగించే పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న వాహనంలో అనంతగిరి మండలంలోని పినకోట సమీపంలో డీజిల్ నింపడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్థరణ జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. మృతుల్లో ఒక ప్రభుత్వ టీచర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది” అని ఈ కేసును పర్యవేక్షిస్తున్న అనంతగిరి ఎస్ఐ శంకర్రావు బీబీసీకి తెలిపారు.
ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అల్లూరి జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
‘‘గుండెల్లో నొప్పి, చనిపోతాననే ఆందోళన’’.. కానీ డాక్టర్లు ఏ అనారోగ్యమూ లేదనేవారు
‘మక్కా ఒప్పందం ఉన్నా తుర్కియేకు హూతీ రెబెల్స్‌తో పోరాడే ఉద్దేశం లేదు’

ఫొటో సోర్స్, Cem Tekkesinoglu/Anadolu via Getty Images
ఫొటో క్యాప్షన్, తుర్కియే రక్షణ మంత్రి యాషర్ గులెర్ ఇరాన్ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా ఎలాంటి సైనిక పోరాటంలోనూ పాల్గొనే ఉద్దేశం తమకు లేదని తుర్కియే తెలిపింది.
వాస్తవానికి సౌదీ అరేబియా, పాకిస్తాన్‌తో కలిసి తుర్కియే ఉమ్మడి రక్షణ ఒప్పందం (మక్కా ఒప్పందం) కుదుర్చుకుంది.అయితే, సౌదీ అరేబియాపై దాడులు చేస్తున్న హూతీ తిరుగుబాటుదారులతో పోరాడేందుకు తుర్కియే నిరాకరించింది.
‘‘హూతీలతో ఎలాంటి పోరాటంలోనూ పాల్గొనే విషయాన్ని మేం పరిశీలించడం లేదు’’ అని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తుర్కియే రక్షణ మంత్రి యాషర్ గులెర్ చెప్పారు.
సౌదీ అరేబియాకు తుర్కియే అందించే సైనిక సహాయం ప్రధానంగా దాడులను నిరోధించే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికే ఉద్దేశించినదని ఆయన తెలిపారు.
ఆగస్టులో తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య ‘మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందం’ కుదిరింది. ఈ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, దాన్ని మూడు దేశాలపై దాడిగా పరిగణిస్తారు.
ఏఐతో చేసే మోసాలను తెలుసుకోవడం ఎలా, ఏమేం గమనించాలి?
ఆంధ్రప్రదేశ్: ‘‘పొంచివున్న తుపాను ముప్పు’’.. ఏయే జిల్లాల్లో అంటే..

ఫొటో సోర్స్, Soumyabrata Roy/NurPhoto via Getty Images
ఫొటో క్యాప్షన్, ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 120 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో తీవ్ర తుపాను గాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచివున్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారనుందని హెచ్చరించింది.
ముఖ్యమైన హెచ్చరికలు, వివరాలు:
- అల్పపీడనం బలపడే తీరు: ఆగ్నేయ, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 25 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.
- ఇది అక్టోబర్ 26 నాటికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మరే అవకాశం ఉందని, ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనించనుందని అంచనా వేశారు.
- భారీ వర్షాలు: ఈ ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీలలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో అతి తీవ్ర వర్షాలు కురిసే సూచనలున్నాయి.
- ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 120 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో (అప్పుడప్పుడు 185 కిలోమీటర్లు) తీవ్ర తుపాను గాలులు వీచే అవకాశం ఉంది.
- మత్స్యకారులకు హెచ్చరిక: సముద్రం అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
- ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించారు.
టీమిండియా న్యూజీలాండ్ టూర్: ఇషాన్ కిషాన్ స్థానంలో ఎవరంటే...?

ఫొటో సోర్స్, MB Media/Getty Images
ఫొటో క్యాప్షన్, తొలి టీ20లో ఇషాన్ కిషన్ కుడి తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఇషాన్ కిషన్ స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ కుమార్ కుశాగ్రాను రెండో టీ20 మ్యాచ్ కోసం భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.
ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్‌లో ఇండియా 'ఏ' జట్టుతో ఉన్న కుశాగ్రా, ఈ మ్యాచ్ కోసం భారత జట్టుతో కలవనున్నాడు.
తొలి టీ20లో ఇషాన్ కిషన్ కుడి తొడ కండరాల గాయం (రైట్ అడక్టర్ స్ట్రెయిన్)తో బాధపడ్డాడు.
రెండో టీ20 కోసం భారత్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్).
కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారంటూ పదేపదే వదంతులు, ఎందుకిలా?
జోర్డాన్: అంత్యక్రియల వద్ద కాల్పులు, ఏడుగురి మృతి

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, కరాక్ గవర్నరేట్‌లోని హమూద్ గ్రామంలో దాడి జరిగినట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. జోర్డాన్‌లోని ఓ చర్చిలో అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరో 34 మంది గాయపడినట్లు తెలిపారు.
కరాక్ గవర్నరేట్‌లోని హమూద్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. దుండగులు ఓ కారులో వచ్చి, చర్చిలోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనను ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ అల్-మోమానీ మొహమ్మద్ ‘హేయమైన దాడి’గా అభివర్ణించారు.
బీబీసీ ధ్రువీకరించిన సీసీటీవీ దృశ్యాల్లో ముగ్గురు సాయుధులు రోడ్డు నుంచి చర్చి వైపు వెళ్తున్నట్లు కనిపించింది.
ఇద్దరు దుండగులు చర్చి ప్రాంగణంలోకి వాహనాలు ప్రవేశించే ద్వారం వైపు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత మూడో వ్యక్తితో కలిసి తిరిగి వస్తున్నట్లు ఆ దృశ్యాల్లో కనిపించింది. ముగ్గురి చేతుల్లోనూ తుపాకులు ఉన్నాయి.
అంత్యక్రియలకు హాజరైన ఓ వ్యక్తి జోర్డాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ అల్-మమ్లకాతో మాట్లాడారు. ఇద్దరు దుండగులు కొన్ని నిమిషాలపాటు కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. సంతాప సభకు వచ్చినవారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు తెలిపారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.
నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
గుడ్‌నైట్.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.
ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా దిల్లీలో నిరసనలు

ఫొటో సోర్స్, SHAAD MIDHAT/BBC
ఎస్ఐఆర్ రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
'పీపుల్ ఎగైనెస్ట్ ఎస్ఐఆర్' బ్యానర్‌తో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయి.
దిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారా సమీపంలో విద్యార్థులు, రైతులు, కార్మికులు సామాజిక కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, SHAAD MIDHAT/BBC

ఫొటో సోర్స్, SHAAD MIDHAT/BBC

ఫొటో సోర్స్, SHAAD MIDHAT/BBC

ఫొటో సోర్స్, SHAAD MIDHAT/BBC

ఫొటో సోర్స్, SHAAD MIDHAT/BBC
ఫొటో క్యాప్షన్, ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా దిల్లీలో నిరసనలు జరుగుతున్నాయి. ‘20 రూపాయల వాటర్ బాటిల్ కోసం మనిషిని ఇంత కిరాతకంగా చంపేస్తారా?’.. విజయవాడ మృతుడి భార్య ఆవేదన
భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై ఐటీబీపీ డీజీ ఏమన్నారు? విపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి
